తెలంగాణ వీణ , సినిమా :తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ సక్సెస్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ఒకటి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ డైరెక్షన్‌లో నటిస్తున్న తలైవా 170 . ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కాగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో మూవీ లవర్స్ ముందుకొచ్చారు మేకర్స్. ఇందులో దుషారా విజయన్ కీలక పాత్రలో నటిస్తోంది. టీంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నట్టు తెలియజేస్తూ ఓ స్టిల్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడీ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ దుషారా విజయన్ ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది తెలియాల్సి ఉంది. తాజా టాక్ ప్రకారం తలైవా 170 ప్రాజెక్ట్ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది.