తెలంగాణ వీణ , జాతీయం : వారానికి 70 గంటల పనిపై ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. యువత వారానికి 70 గంటలు కచ్చితంగా పని చేయాలన్న వ్యాఖ్యలపై అటు నెటిజన్లు నుంచి ఇటు పలు టెక్ దిగ్గజాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో ఎడిల్‌వీస్ సీఎండీ రాధికా గుప్తా స్పందించారు. భారతీయ మహిళలు దశాబ్దాల తరపడి 70 గంటలకు మించి పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదంటూ విచారం వ్యక్తం చేశారు.
ఇంటి పని, ఆఫీసు పనిని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు, తరువాతి తరం పిల్లలభవిష్యత్‌ను సక్రమంగా తీర్చిదిద్దుతూ చాలామంది భారతీయ మహిళలు 70 గంటల కంటే ఎక్కువే శక్తికి మించి పని చేస్తున్నారని రాధికా గుప్తా గుర్తు చేశారు. దశాబ్దాల తరబడి చిరునవ్వుతో ఓవర్ టైంని డిమాండ్ చేయకుండానూ అదనపుభారాన్ని మోస్తూనే ఉన్నారు. కానీ విచిత్రంగా దాన్ని ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్‌పై చాలామంది సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్ లతా వెంకటేష్ స్పందిస్తూ నిజానికి, తన భర్త, తానూ కూడా తమ కుమారుడి పెంపకంలో చాలా సాయం చేశారు. అలాగే ముంబై లాంటి మహానగరాల్లో పనికంటే మనం అందరం ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటూ పరోక్షంగా మూర్తి వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. అవును అమ్మకు ఆదివారం లేదు.. వారాంతంలో కూడా పనిచేయాలని ఒకరు, ఆఫీస్ పని లేకపోయినా కూడా భారతీ మహిళలు కుటుంబ పోషణ కోసం వారానికి 72 గంటలకు పైగానే పని చేస్తున్నారు. చాలా కరెక్ట్‌గా చెప్పారు..అలుపెరుగని ఆడవారి శ్రమను ఎవరూ గుర్తించడం లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇప్పటికైనా వారి కమిట్‌మెంట్‌ను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు మరో యూజర్.