తెలంగాణ వీణ, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్ కి కేటాయించిన 56 ఏకురాల ల్యాండ్ లో 77కోట్ల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీతో దేశంలో అతిపెద్ద నూతన భవనాన్ని నిర్మిస్తుంది. మేడిపల్లిలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ భూమిలో భవన నిర్మాణానికి రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్ తో కలిసి మంత్రులు మహమ్మద్ అలీ, చామకుర మల్లారెడ్డి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మేడ్చల్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, కమిషనరేట్ పరిధిలోని మేయర్లు, చైర్మన్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు..