తెలంగాణ వీణ, సినిమా : కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ‘కన్నప్ప’ సినిమాను గురించిన వార్తలే కనిపిస్తున్నాయి .. వినిపిస్తున్నాయి. మంచు విష్ణు సొంత బ్యానర్ పై .. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఇంతవరకూ వచ్చిన సినిమాలలో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. ఒక వైపున ఈ సినిమా షూటింగు జరుగుతూ ఉండగానే .. మరో వైపున అప్ డేట్స్ అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ .. మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారనేది ఈ ప్రాజెక్టును గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తోంది. అయితే ఇందులో ప్రభాస్ పాత్ర ఏమిటనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. ఈ సినిమాలో ఆయన మహాశివుడి పాత్రలో కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ పాత్రకి ఆయన కరెక్టుగా సెట్ అవుతాడనే అభిప్రాయాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘కన్నప్ప’ శక్తిని పరీక్షించడం .. అర్జునుడిగా కన్నప్ప ఉన్నప్పుడు అతనితో బోయవాడిగా శివుడు తలపడటం .. ‘కన్నప్ప’ పస్తులుంటే అతని కోసం శివుడు మారువేషంలో వచ్చి బ్రతిమాలటం .. కన్నప్ప అజ్ఞానాన్ని తొలగిస్తూ అతనికి సాక్షాత్కారం ఇవ్వడం .. ఇలాంటి సన్నివేశాలన్నీ ఈ కథలో కనిపిస్తాయి. ఇలా విష్ణు – ప్రభాస్ కాంబినేషన్ లోని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ‘బాహుబలి’లో జానపదులతో ‘శివుడు’గా పిలిపించుకున్న ప్రభాస్, ఇప్పుడు మహాశివుడిగా కనిపించనున్నాడంటే ఫ్యాన్స్ కి పండగే. ప్రభాస్ పోషించేది ఈ పాత్రనే అయితే, ఇక ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అందుకోవడం ఖాయమనే చెప్పాలి.