తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిగా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియమించారు.
తనను ఇన్‌చార్జిగా నియమించిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు పోచంపల్లి కృతజ్ఞతలు తెలిపారు. 2018 ఎన్నికల్లో ములుగు బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయినా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ములుగును జిల్లాగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దకిందని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించడం ద్వారా ఆయన రుణాన్ని తీర్చుకుంటామని పేరొన్నారు.