తెలంగాణ వీణ , జాతీయం : రేపు(మంగళవారం) మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డ్‌లను ప్రధాని ప్రకటించారు. పసుపు బోర్డ్ కోసం ఎన్నో ఏళ్లుగా రైతుల డిమాండ్ ఉంది. రేపు మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు.నిజామాబాద్ భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు.గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పాలమూరు సభ జరిగింది. ఈ నెల 10వ తేదీన అమిత్ షా తెలంగాణకు వస్తారు. అక్టోబర్ 5,6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటాయి. జేపీ నడ్డా రానున్న ఎన్నికల కోసం దిశా నిర్దేశం చేస్తారు.అక్టోబర్ రెండోవారంలో తెలంగాణ అభ్యర్థుల లిస్ట్ ప్రకటన ఉంటుంది’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.