తెలంగాణ వీణ, ఉప్పల్ : కాప్రా సర్కిల్ మీర్పెట్ హెచ్ బీ కాలని డివిజన్ పరిధిలో బిజేపీ ఎస్.సి మోర్చ జిల్లా అధికార ప్రతినిధి రాయిని ఉదయ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 200 మంది బిజేపి, బిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరారు. దేశంలో బిజేపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, కాంగ్రెస్ తోనే అభివృద్ది సాధ్యమని కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన వారిలో ధీరజ్ సభాస్టియన్, ప్రీతమ్, సంపత్, వేణు, సాయి, రాజేష్ తదితరులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పరమేశ్వర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి మందుముల పరమేశ్వర్ రెడ్డి గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లతో ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తుందని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచు కోట, ఉప్పల్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తం అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ జలగం వెంకటేశం, సీనియర్ నాయకులు సీతారాం రెడ్డి, నరేందర్, శ్రీనివాస్, నవీన్ గౌడ్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.