తెలంగాణ వీణ , సినిమా : పెదకాపు సినిమాపై మాస్ ఆడియెన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాడు. దానికి తోడు భారీ లెవల్లో ప్రమోషన్‌లు గట్రా చేయడంలో రిలీజ్ ముంగిట సినిమా తిరుగులేని హైప్ నెలకొంది. ఎలాగో నారప్పతో యాక్షన్‌ను డీల్ చేసిన అనుభవం ఉంది కాబట్టి.. ఈ సినిమా కూడా ఊహించని రేంజ్‌లో ఉంటుందని అందరూ అమితాసక్తితో ఎదురు చూశారు. ఇక కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో రెండు రోజుల ముందు పేయిడ్ ప్రీమియర్లు కూడా వేశారు. ఆ ప్రీమియర్‌లకు ఆహా ఓహో అన్న రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. డీసెండ్‌గా ఉందని రివ్యూలు ఇచ్చారు. తీరా రిలీజయ్యాక ఆ డీసెంట్ టాక్ కూడా రాలేదు. కొన్ని మంచి సీన్లు పడ్డాయి కానీ.. ఓవరాల్‌గా చూసుకుంటే చాలా లాగ్ ఉందని, బోర్ కొట్టే అంశాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు.