తెలంగాణ వీణ,శామీర్‌పేట:కెసిఆర్ జూటా మాటలను తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే అభ్యర్థి వజ్రష్ యాదవ్ అన్నారు.శామీర్ పేట్ మండలం అలియాబాద్ గ్రామంలో మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వజ్రష్ యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ జూటా మాటలను తిప్పిగొట్టి బిఆర్ఎస్ మాయలోంచి ప్రజలను బయటకి తీయాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన్న సోనియా గాంధీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ లు ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్షంగా పనిచేయాలన్నారు. రాహుల్ గాంధీ, కార్గేల నాయకత్వంలో ప్రవేశ పెట్టిన ఎన్నికల మేనిపెస్టో లోని 6 గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పారు. బిఆర్ఎస్ నేతలు చేసిన అరాచకాలు, బిఆర్ఎస్ ప్రభుత్వ వైపల్యాలను ఎత్తిచూపి ప్రజలకు అవగాహనా కల్పియాలని కోరారు. నిరుద్యోగ యువతకు చేసిన అన్యాయం, ప్రజలను చేస్తున్న దోపిడీని వివరించాలి అన్నారు. గ్రామ గ్రామన ప్రజలను కూడగట్టుకుని కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్షంగా పనిచేయాలని కోరారు. పార్టీ లో లోటుపాట్లు సహజమే. పార్టీ కోసం కలిసి కట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీ కి భారీ మెజారిటీ కట్టబెట్టాలని కోరారు. ఈ ఎన్నికల్లో మల్లారెడ్డిని ఓడించక పొతే మేడ్చల్ ప్రజలది వలస పాలన అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు వై ఎస్ గౌడ్, మహిళ అధ్యక్షురాలు నర్మధ, కో అప్షన్ సభ్యుడు ముజీబ్, మహేందర్ యాదవ్, వార్డ్ సభ్యులు బండి రాంరెడ్డి, ముద్దం సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోలిపల్లి రాజశేఖర్ రెడ్డి, మండల్ యూత్ ప్రెసిడెంట్ నవీనరెడ్డి, జామల్పూర్ ఈశ్వర్, జశ్వంత్ రెడ్డి, ఆనంద్, ధర్మారెడ్డి, మాజీ డైరెక్టర్ మేడి మల్లేష్, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, తదితలు పాల్గొన్నారు.