తెలంగాణవీణ, జాతీయం : మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణాలు ఆగడం లేదు. నిన్న నాందేడ్.. నేడు ఔరంగాబాద్ దవాఖానలో రోజూ పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.రాష్ట్రంలో 48 గంటల వ్యవధిలో రెండు ప్రభుత్వ దవాఖానాల్లో 49 మరణాలు చోటుచేసుకున్నాయి.మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణాలు ఆగడం లేదు. నిన్న నాందేడ్.. నేడు ఔరంగాబాద్ దవాఖానలో రోజూ పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో 48 గంటల వ్యవధిలో రెండు ప్రభుత్వ దవాఖానాల్లో 49 మరణాలు చోటుచేసుకున్నాయి. సరైన వైద్య సేవలు, ఔషధాలు, వైద్య పరికరాలు లేకపోవటం రోగుల వరుస మరణాలు కారణమని ప్రతిపక్షాలు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఔరంగాబాద్ ఛత్రపతి శంభాజీనగర్‌లోని ప్రభుత్వ దవాఖానలో 24 గంటల వ్యవధిలో 18 మందికిపైగా రోగులు మృత్యువాత పడ్డారు. ఇందులో ఇద్దరు నవజాత శిశువులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.