తెలంగాణ వీణ , సినిమా : ఇప్పుడు నయనతారను చూస్తుంటే ఆరంభంలో అవకాశాల కోసం బస్సులో కొచ్చి నుంచి చెన్నైకి వచ్చిన నటేనా అని ఆశ్చర్యం కలిగించకమానదు. కేరళా రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన నయనతార ఇప్పుడు కోట్లకు పడగెత్తి చెన్నైలో అధునాతనమైన భవనంలో సుఖ జీవితాన్ని అనుభవిస్తున్నారు. అదీ లక్ అంటే. కెరీర్ మొదట్లో సినీ రంగంలో ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్న నయనతార నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత కూడా వ్యక్తిగత జీవితంలో పలుమార్లు చేదు అనుభవాలను చవి చూశారు. కాలం అన్నింటినీ అధిగమిస్తుందంటారు.
అలా తన జీవితం నేర్పిన గుణపాఠాలతో రాటుదేలిన నయనతార అవరోధాలు, అవమానాలకు అందనంత ఉన్నత స్థాయి ఎదిగిపోయారు. ఎంతగా అంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం డిమాండ్ చేసేంత స్థాయికి. ఈ లేడీ సూపర్ స్టార్ ఒక్కో చిత్రానికి రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన నయనతార ఈ చిత్రానికి అక్షరాలా రూ.10 కోట్లు పారితోషికం అందుకున్నట్లు సినీ వర్గాల భోగట్టా.