తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : అబద్దాలు ఆడడంలో మామ చంద్రబాబుకు తగ్గ కోడలు అనిపించుకుంటోంది నారా బ్రాహ్మణి. లులూ కంపెనీ విశాఖలో ఒక మాల్ పెడతామని ముందుకు వచ్చినా, చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో ఎందుకు పెట్టలేకపోయారో ఆమె వివరించగలగాలి. ఆ సంస్థవారు ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో మాల్ పెట్టుకున్నారా?.. లేదంటే వాళ్ల సొంత స్థలంలో లేదంటే ఒక మూత పడ్డ మాల్ స్థానే పెట్టారా?.. మాల్ పెడితే పరిశ్రమలు వచ్చేసినట్లే చెప్పాలనుకుంటే, జగన్ ప్రభుత్వ హయాంలో.. ఏపీలో రామాయపట్నం వద్ద శరవేగంతో ఒక ఓడరేవు నిర్మాణం అవుతోంది. వేలాది మందికి అక్కడ ఉపాధి వస్తోంది. మరి దానిని ఏమనాలి?. విశాఖపట్నంలో ఒక భారీ డేటా సెంటర్ వస్తోంది. ఇన్ఫోసిస్ శాఖ వస్తోంది. కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ , కర్నూలులో గ్రీన్ ఎనర్జీ ..ఇలా అనేకం వస్తుంటే.. బ్రాహ్మణికి హైదరాబాద్‌లో పెట్టిన లులూ మాల్ గొప్పదిగా కనిపిస్తోంది. ఇది.. చూసే కళ్లను బట్టి ఉంటుంది.
✍️ఇక జయదేవ్ కు చెందిన అమరరాజా కంపెనీని ఎవరు ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని చెప్పారు? ఆ మాటకు వస్తే ఆయన చంద్రబాబు టైమ్లో ఎందుకు ఏపీలో కొత్త పెట్టుబడులు పెట్టలేదో బ్రాహ్మణి చెప్పగలరా? అంతెందుకు.. అసలు తమ కంపెనీ హెరిటేజ్ ను చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీలో ఎందుకు విస్తరించలేదు?. కొత్త ప్లాంట్లు పెట్టలేదు?. కేవలం అమరావతి రాజధాని లో తమకు అనుకూలంగా రింగ్ రోడ్డును ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించి తాము కొన్న భూముల విలువ పెంచుకోవడానికి ప్రయత్నించారే తప్ప.. ఏపీలో ఏమైనా కొత్తగా హెరిటేజ్ పరిశ్రమ యూనిట్ పెట్టారా?. ఆమె అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలలో వచ్చే చెత్త కధనాల ఆధారంగా వ్యాఖ్యానించినట్లు అర్ధం అవుతుంది