తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ను వీడి కుమారుడు రోహిత్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఆయన రాకను వ్యతిరేకిస్తూ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ఏం జరుగుతున్నదో అర్థంకాక మైనంపల్లి తల పట్టుకున్నారు. మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆదివారం కాంగ్రెస్‌ను వీడగా. . సోమవారం మల్కాజిగిరి డీసీసీ చీఫ్ నందికంటి శ్రీధర్ పార్టీకి బైబై చెప్పేశారు. మరోవైపు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు జే వెంకట్‌రెడ్డి కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ పరిణామాన్ని ఊహించని పార్టీతోపాటు మైనంపల్లి కూడా నివ్వెరపోతున్నారు. మైనంపల్లి చేరికను తిరుపతిరెడ్డి, శ్రీధర్ ఇద్దరూ వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినా అధిష్ఠానం గుడ్డిగా ముందుకెళ్లడంతో వారిద్దరూ రాజీనామా చేశారు. వీరిని బుజ్జగించేందుకు చేసే ప్రయత్నాలు ఫలించలేదు. భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్ శ్రీధర్ ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలే దు. ఇప్పుడు మరికొందరు నేతలు కూడా పార్టీ ని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసిం