తెలంగాణ వీణ , జాతీయం : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, ఏనుగు రవీందర్ రెడ్డి, శాసన మండలి మాజీ ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కరీంనగర్ బీర్ఎస్ నేత సంతోష్ కుమార్ లు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వీరందరికీ ఖర్గే కండువా కప్పి ఆహ్వానించారు.