తెలంగాణ వీణ , సినిమా : ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌లోని నాగసాకి, హిరోషిమా నగరాల్లో వేసిన అణుబాంబుల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే, టార్పిడో టార్నాడోల కంటే, సునామీల కంటే కాపియింగ్ చాలా ప్రమాదరకం. చూసి రాసినవాడు డాక్టర్ అయితే పేషెంటు బతుకుతాడా? చూసి రాసినవాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జీ నిలబడుతుందా కూలిపోతుంది. అలాగే విద్యావ్యవస్థ చిన్నాభిన్నం అయితే దేశమే కుప్పకూలిపోతుంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇలా.. చాలా అంశాలపై ఈ సినిమాలో ప్రశ్నలు సంధించాం. సమాధానాలూ చెప్పామ’’న్నారు.