Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మోదీ మాటలన్నీ ఉత్త కోతలే.

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ పుట్టుకనే ద్వేషిస్తున ప్రధాన నరేంద్రమోదీ.. రాష్ర్టాన్ని అడుగడుగునా అణగదొక్కాలని చూస్తున్నారు. గత తొమ్మిదేండ్లుగా తెలంగాణపై అన్నింటా వివక్ష చూపుతున్నారు. రాష్ర్టానికి వచ్చినప్పుడేమో తెలంగాణకు లక్షల కోట్లు కేటాయించినట్టు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు. అవన్నీ గాలి మాటలేనని తాజా నివేదికలో కంప్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) బట్టబయలు చేసింది. దేశంలోని అన్ని రాష్ర్టాల ఆర్థిక స్థితిగతులు, కేంద్రం నుంచి రాష్ర్టాలకు అందిన సా యాలు తదితర అంశాలతో కూడిన ఈ సమ గ్ర నివేదిక ఇటీవలే విడుదలైంది. ఆ లెక్కల ప్రకారం.. తెలంగాణపై కేంద్రం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో తెలంగాణకు రూ.41,001 కోట్లు అందుతాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. తదనుగుణంగానే బడ్జెట్‌లో అంచనాలు వేసింది. కానీ, ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం చేసిన సాయం రూ.13,179 కోట్లు మాత్రమే. ఇది రాష్ట్ర అం చనాలో కేవలం 32 శాతమే.

ప్రస్తుం ఆర్థిక సం వత్సరం (2023-24)లోనైనా తెలంగాణపై కేంద్రం దయ చూపుతుందని ఆశిస్తుంటే.. మో దీ సర్కారు మళ్లీ అదే వివక్షను ప్రదర్శిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాం ట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో మొత్తంగా రూ.41,259 కోట్లు అందవచ్చని రాష్ట్రం అం చనా వేస్తే.. గత ఐదు నెలల్లో రూ.3,009.26 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది రాష్ట్ర అంచనాలో కేవలం 7.29 శాతమే. తెలంగాణకు కేంద్రం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లో ఆది నుంచే కోతలు పెడుతున్నది. ఏటేటా ఈ కోతలు మరింత పెరుగుతున్నాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం నుంచి రాష్ర్టానికి అందే గ్రాంట్‌ బడ్జెట్‌ అంచనాలో 50 శాతానికి మించకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌కు ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రూ.13,371 కోట్ల సాయం అందించిన కేంద్ర ప్రభుత్వం.. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు గత 5 నెలల్లో ఏకంగా రూ.13,990 కోట్ల సాయం చేసింది. అదే సమయంలో తెలంగాణకు రూ.3,009 కోట్లు మాత్రమే విదిల్చింది. దీనితో పోలిస్తే గుజరాత్‌కు రూ.10,362 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.10,981 కోట్లు అధికంగా నిధులు అందించిన కేంద్రం.. కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాలకు సైతం తెలంగాణ కంటే ఎక్కువగానే సాయం చేసినట్టు కాగ్‌ నివేదిక వెల్లడించింది.

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాలకు పుష్కలం
తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాలకు మాత్రం పుష్కలంగా నిధులను అందజేస్తున్నది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌-ఆగస్టు మధ్య గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రూ.13,371 కోట్ల సాయం అందించింది. ఆ రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలో ఇది 83 శాతానికి సమానం. ఇదే సమయంలో మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు రూ.13,990 కోట్లు (బడ్జెట్‌ అంచనాలో 14 శాతం), మధ్యప్రదేశ్‌కు రూ.11,966 కోట్లు, మహారాష్ట్రకు రూ. 8,062 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మిగిలిన బీజేపీ పాలిత రాష్ర్టాలతోపాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాలకు సైతం తెలంగాణ కంటే మెరుగ్గానే సాయం అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 5 నెలల్లో రాజస్థాన్‌కు రూ.8,303 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.5,792 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ. 3,453 కోట్లు, కర్ణాటకకు రూ.3,108 కోట్ల గ్రాంట్‌ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ నేతలు కాగ్‌ నివేదికతోనైనా కండ్లు తెరవాలని తెలంగాణ సమాజం ఆశిస్తున్నది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you