తెలంగాణ వీణ, రంగారెడ్డి : మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాలలో విజయ మెగా డైరీ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.. తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ పేరుతో, నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ సహకారంతో, 40 ఏకారాల విస్తీర్ణంలో 246.26కోట్ల వ్యయంతో, 5 నుండి 8 లక్షల లీటర్ల కెపాసిటీ తో పూర్తిగా ఆటోమేటెడ్ టెక్నాలజీతో నిర్మించిన, మెగా డైరీ విజయ తెలంగాణ ప్లాంటు ను రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్,తో పాటు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, MLC దయానంద్ గుప్త, BC కమిషన్ సభ్యులు బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు.