తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నేడు తలపెట్టిన ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ కార్యక్రమానికి బాబు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. నేడు మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకూ మెట్రోలో నల్ల టీషర్టులు ధరించి ప్రయాణిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు చంద్రబాబు అభిమానులు నిర్ణయించిన విషయం తెలిసిందే. నల్లచొక్కాలు ధరించిన వారిని లోపలకు అనుమతించడం లేదు. చంద్రబాబు అభిమానులు భారీగా తరలిరావడంతో మియాపూర్ మెట్రో స్టేషన్‌ను సిబ్బంది కాసేపు తాత్కాలికంగా మూసేశారు. అనంతరం, ప్రయాణికులను అనుమతించారు.