తెలంగాణ వీణ , జాతీయం : అక్రమ అరెస్టును నిరసిస్తూ బెంగళూరు నగరవ్యాప్తంగా అభిమానులు మోత మోగించారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నిరసన సాగింది. సహకారనగర్ మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు బారులుతీరి మోత మోగించారు. ప్రముఖులు సి.ప్రభాకర్, నవీన్‌కుమార్, శిరీష్, భారతి, వైవీ కృష్ణారావు, కిరణ్, హరీశ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మారతహళ్లిలో బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో మద్దతు తెలిపారు. ప్రతిచోటా గంటలు మోగించడం, తట్టను గరిటతో వాయించడం, విజిల్స్ వేయడం ద్వారా మద్దతు తెలిపారు. టీడీపీ ఫోరం ముఖ్యుడు సోంపల్లి శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలసి మోత మోగించారు. ఇట్టిమడులో చిత్తూరు జిల్లా నగరి తెలుగుదేశం ఇన్‌చార్జ్ గాలి భానుప్రకాశ్‌తోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. బెంచీలపై కర్రలతో కొడుతూ విజిల్స్ వేస్తూ మద్దతు తెలిపారు. మేదరమెట్ల మోహన్‌నాయుడు, దొడ్డపనేని నాగేశ్, రావెళ్ల గోవర్ధన్, చిట్టిబాబు, శివ పాల్గొన్నారు. కాగా బాణసవాడి బూత్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన గంగవరపు సుబ్బారావు, కూండ్ల వెంకటేశ్వర్లు, దారపునేని సుబ్బారావు, రెడ్లదిన్నె కేశవులు, కురుగొండ్ల దామోదర్ పాల్గొన్నారు.