తెలంగాణ వీణ,హైదరాబాద్ : పీవీ నర సింహారావు ఎక్స్ప్రెస్ హైవేపై కారులో వెళ్తున్న ఓ జంట సన్ రూఫ్ ద్వారా బయటకు వచ్చి రొమాన్స్ చేస్తూ షికారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై నెటిజట్లు పోలీ సులకు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇవాళ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైరల్ వీడియోను పోస్ట్ చేశారు. ‘స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివా రిని ఇబ్బందులను గురిచేసేలా యువత ఇలా ప్రవర్తించడం సరికాడు అని, స్వేచ్ఛ.. ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ… వారికి ఇబ్బంది కలిగిం ఉండాలి.బహిరంగ ప్రదేశాలు, రహదారులపై చేసే ఈ చేష్టలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.’ అని పేర్కొన్నారు.
Tweetస్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివారిని ఇబ్బందులను గురిచేసేలా యువత ఇలా ప్రవర్తించడం సరికాదు. స్వేచ్ఛ.. ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ.. వారిని ఇబ్బంది కలిగించకుడా ఉండాలి. బహిరంగ ప్రదేశాలు, రహదారులపై చేసే ఈ చేష్టలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. pic.twitter.com/4PM6GDvRCc
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 16, 2023