తెలంగాణ వీణ,ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టయ్యాక ‘మోత మోగిద్దాం’, ‘కాంతితో క్రాంతి’, ‘న్యాయానికి సంకెళ్లు’ పేరిట తెలుగుదేశం పార్టీ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతోంది. తాజాగా, టీడీపీ కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీని పేరు ‘కళ్లు తెరిపిద్దాం’. రేపు (అక్టోబరు 29) రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు కళ్లకు గంతలు కట్టుకుని, వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా “నిజం గెలవాలి” అంటూ గట్టిగా అరవాలని టీడీపీ పేర్కొంది. జగనాసుర చీకటి పాలనకు నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరింది.
Tweetనిజం గెలవాలి… చంద్రబాబు గారికి వేసిన సంకెళ్లు బద్దలు కావాలి. అది జరగాలంటే జగనాసురునికి కనువిప్పు కావాలి. అందుకే అక్టోబర్ 29, 2023… ఆదివారం రాత్రి 7 గంటలకు కళ్ళకు గంతలు కట్టుకుందాం. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి చంద్రబాబుగారికి మద్దతుగా "నిజం గెలవాలి" గట్టిగా అరుద్దాం… pic.twitter.com/ajU5GIxFTV
— Telugu Desam Party (@JaiTDP) October 28, 2023