తెలంగాణ వీణ , సినిమా : ఈ సినిమా.. లాంఛ్ చేసిన రోజు నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీకి సంబంధించి ఒక లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మూవీపై ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ‘లియో’ మైండ్ బ్లోయింగ్ మూవీ. నా డబ్బింగ్ సమయంలో ‘లియో’లోని కొన్ని సీన్స్ చూశా. సినిమా సూపర్‌గా వచ్చింది. విజయ్‌తో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి అంటూ గౌతమ్ మీనన్ తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వీడియోను చూసిన దళపతి ఫ్యాన్స్ ‘లియో’ బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ తెగ వైరల్ చేస్తున్నారు.