Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బాధతో పార్టీని వీడుతున్నా

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్‌ ద్వారా పంపినట్లు తెలిపారు. అల్వాల్‌లోని ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నాననీ, మల్కాజిగిరిలో పార్టీ కోసం పని చేస్తూ ప్రత్యర్థిగా ఉన్న మైనంపల్లి హన్మంతరావుతో విభేదించిన సందర్భంగా పలు కేసులు నమోదు అయ్యాయన్నారు.బీఆర్‌ఎస్‌లో తన కొడుకుకు టికెట్‌ రాకపోవడంతో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరారని ఈ క్రమంలో తనకు మల్కాజిగిరిలో పార్టీ టికెట్‌ ఇవ్వలేమన్న సంకేతాలు రావడం బాధించాయన్నారు. బీసీలకు అన్ని పార్టీలకన్నా అధిక సీట్లు ఇస్తామని ప్రకటించిన నాయకులు తన మాదిరిగా వెనుకబడిన తరగతి నుండి వచ్చిన వ్యక్తికి టికెట్‌ ఇవ్వకపోవడం చూస్తుంటే బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you