తెలంగాణ వీణ , హైదరాబాద్ : అధికార బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు సీట్ల కేటాయింపు విషయంలో బీఆర్‌ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ధర్నాలు చేశారు కానీ.. మహిళలకు సీట్లను మాత్రం కేటాయించలేదన్నారు.
ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించింది. తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించాం. ఏ క్షణంలోనైనా అభ్యర్థుల ప్రకటన ప్రకటించవచ్చు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తోంది. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది.
అభ్యర్థుల మొదటి విడతలో బీసీలకు 20పైగా సీట్లు కేటాయిస్తున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీల సేవలు వాడుకుని వదిలేస్తున్నారు. బీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోంది.