తెలంగాణ వీణ , హైదరాబాద్ : మనకు మొనగాడు లాంటి కేసీఆర్ ఇక్కడ ఉండగా.. అన్నింటికీ ఢిల్లీపై ఆధారపడే అడ్డమైన వెధవలు మనకు అవసరమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మతం పేరుతో రాజకీయం చేసే చిల్లర పార్టీ కాదు మాది.. కులం పేరుతో విభజించే చిల్లర పార్టీ కాదు బీఆర్ఎస్ అని కేటీఆర్ తేల్చిచెప్పారు. అందర్నీ కలుపుకొని పోయి నడిచే పార్టీ. గరీబోడు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఆయనను ఆదుకోవాలన్నదే మా దృక్పథం తప్ప.. ఇంకో ఆలోచన లేనే లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయానికి వస్తే.. దేవుడితోనైనా కొట్లాడటానికి వెనుకాడని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించుకున్న రోజు కృష్ణమ్మ పొంగుకుంటూ వస్తే మనందరి గుండెలు ఉప్పొంగిన మాట వాస్తవం కాదా..? 70 ఏండ్ల తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నీళ్ల గోస తీర్చబోతున్నారు కేసీఆర్. కాంగ్రెస్ ఎందుకు ఆలోచన చేయలేదు.. కృస్ణా జలాలు తీసుకురావాలని. కాంగ్రెసోళ్లకు బీజేపోళ్లకు హైకమాండ్.. ఢిల్లీలో ఉంటది. టికెట్ల పంచాయితీ, పైసల వసూళ్ల పంచాయితీ అంతా ఢిల్లీలోనే. మొనగాడు లాంటి కేసీఆర్‌ను ఇక్కడ పెట్టుకుని, ఈ అడ్డమైన వెధవలు మనకు అవసరమా..? సీట్లు, ఓట్లు అమ్ముకునే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవసరమా..? కాంగ్రెస్, బీజేపీని ఢిల్లీకి తన్ని తరిమేయాలి. ఆనంద్ కొన్ని కోరికలు కోరిండు. కాకపోతే నాలుగు రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తున్నది. ఐటీ హబ్ అడిగిండు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌ను డెవలప్ చేయాలి.. పర్యాటక క్షేత్రం చేయాలన్నాడు. కరోనా వల్ల కొద్దిగా ఈ టర్మ్‌లో స్లో అయ్యాం. వచ్చే టర్మ్‌లో కారు జోరుగా ఉరుకుతది. తప్పకుండా సార్ ముఖ్యమంత్రి అయితడు. ఆనంద్ ఎమ్మెల్యే అయితడు. మీ కోరిక మేరకు