తెలంగాణ వీణ , జాతీయం : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీపై వ్యాఖ్యలకు సంబంధించి వీరిద్దరిపై గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే విధించడానికి గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది.
ఇరువురు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్లను గురువారం విచారించిన జస్టిస్ జేడీ దోషి స్టే ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై గుజరాత్ యూనివర్సిటీకి నోటీసులు జారీ చేస్తూ కేసు తదుపరి విచారణను నవంబర్ మూడో తేదీకి వాయిదా వేశారు.