తెలంగాణ వీణ , రాష్ట్రీయం : కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆదిలాబాద్ జనగర్జన సభలో పలు ఆసక్తికర విషయాలను మాట్లాడారు అమిత్ షా. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ ఆదివాసులకు ఏం చేశారో చెప్పాలి. తెలంగాణను ఆత్మహత్యల్లో, నిరుద్యోగంలో, కుంభ కోణాల్లో నెంబర్ వన్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణలో రైతులు, పేదలకు ఒరిగింది ఏం లేదన్నారు. కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు.