తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్, జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభకు హాజరై.. ప్రసంగించనున్నారు. సభకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..