తెలంగాణ వీణ , హైదరాబాద్ : సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జరుపుకొనే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం, తెలంగాణ ఆత్మగౌరవ సంబరం బతుకమ్మ అన్నారు. ఈ నేపథ్యంలో భారత జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల ఆల్బమ్‌ను కవిత విడుదల చేశారు. మొత్తం 10 పాటలున్న ఈ ఆల్బన్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఒక పాటకు ఎమ్మెల్సీ కవిత కోరస్ ఇవ్వడం విశేషం.