తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ తన స్క్రిప్ట్ రైటర్ మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి విద్రోహ అనుబంధం ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
కాగా, ఎమ్మెల్సీ కవిత శనివారం మెట్‌పల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పెద్దరికాన్ని మరిచి బతుకమ్మపై కామెంట్స్ చేశారు. తన పేరుతో ఎలిజిబెత్ రాణి అని మాట్లాడి ఆయన పెద్దరికాన్ని కోల్పోయారు. రాహుల్ గాంధీకి తెలివికి లేదు. తెలంగాణలో బీసీ గణన చేయాలనుకుంటున్నాడు అంటా. ఇలా అవగాహన లేకుండా మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పెట్టారని చెబుతున్నారు. కానీ, 1937లోనే నిజాం రాజు ఫ్యాక్టరీని నెలకొల్పాడు. ఇలా అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉంది.