బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని భాషల్లోనూ ఈ షో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళ్‌లో బిగ్‌బాస్ 7 సీజన్ నడుస్తోంది. కాగా, కన్నడనాట బిగ్‌బాస్ 10 సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే, బిగ్‌బాస్ హౌస్‌లోకి షాకింగ్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చాడు.
ఎవ్వరూ ఊహించని విధంగా కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లోకి ఓ రాజకీయ నాయకుడు పోటీదారుగా ప్రవేశించాడు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు. డప్పుచప్పుళ్ల మధ్య అతడు ఘనంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎమ్మెల్యేను చూసిన ఇతర పోటీదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక అతడి ఎంట్రీకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.