తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడమా లేక పోలీసు కస్టడీకి అప్పగించడమా అన్నదానిపై ఏసీబీ కోర్టు సోమవారం నిర్ణయించనుంది. చంద్రబాబుకు బెయిల్, కస్టడీ పిటిషన్లపై మూడురోజులపాటు సాగిన వాదనలు శుక్రవారం ముగిశాయి.
అనంతరం తీర్పును రిజర్వు చేస్తున్నామని, సోమవారం నిర్ణయాన్ని వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. బాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబె, సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బాబును మరో మూడు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని, సెంట్రల్ జైలులోనే ఆయనను ప్రశ్నిస్తామని సీఐడీ కోరుతున్నది.