తెలంగాణ వీణ , క్రీడలు : క్రికెట్‌లో మరో పతకం దిశగా టీమ్‌ఇండియా (Team India) దూసుకెళ్తున్నది. ఇప్పటికే మహిళల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించగా.. ఇప్పుడు మెన్స్ టీమ్ వంతు వచ్చింది. క్వార్టర్ ఫైనల్‌లో నేపాల్‌తో భారత జట్టు తలపడుతున్నది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నేపాల్ (Nepal) ముందు 203 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ జట్టుకు శుభారంభాన్నించ్చింది. నేపాలీ బౌలర్లతో ఓ ఆటాడుకున్న జైస్వాల్.. 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉండటం విశేషం. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 25, రింకూ సింగ్ 37, శివమ్ దూబె 25 రన్స్ చేశారు. బ్యాటర్ల విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్‌ఇండియా 4 వికెట్లకు 202 పరుగులు చేసింది.