తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఈ నియోజకవర్గానికి ఏం చేయాలో నాకు ఐడియా ఉంది. ప్రజల్లో గుర్తింపు ఉంది. ప్రభావం ఎంత అనే విషయం డిసెంబర్ మూడో తారీఖు మీరే చూస్తారు. ఉండాల్సింది.. రాజకీయ పరిజ్ఞానం. ప్రజలకు సేవ చేయాలనే తపన. ఈ రెండూ ఉంటే ప్రజలు గెలిపిస్తారు. ఆ తర్వాత అనుభవం అదే వస్తుంది. పదేండ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెప్పడమే నా వ్యూహం.
మొన్నటి వరకు మీ పార్టీలోనే ఉండి.. రెండు టికెట్లు ఇవ్వలేదని పార్టీ మారిన మైనంపల్లి హన్మంతరావు మీద మీ కామెంట్? కొడుక్కి మెదక్ టికెట్ ఇవ్వలేదని పార్టీ మారిన స్వార్థం ఆయనది. కబ్జాలు, గుండాయిజం తప్ప ప్రజాసేవ పట్టని అలాంటి సెల్ఫిష్ లీడర్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు.
ప్రజలకు ఒక క్లారిటీ ఉందండీ. కేసీఆర్ మళ్లీ గెలిస్తేనే మన జీవితాలు మరింత బాగుపడతాయని నమ్ముతున్నరు. ఎవరూ చేయని అభివృద్ధి చేసి చూపిన విజన్ ఉన్న లీడర్ ఆయన. చెప్పినవి మాత్రమే కాదు.. చెప్పనివీ ఎన్నో చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా ప్రచారమే మొదలు పెట్టలేదు. మీరేమో స్పీడ్‌గా దూసుకెళ్తున్నారు… ప్రతిపక్షాల అభ్యర్థులు ఎవరో తేలాలంటే ఇంకా చాలా టైమ్ పట్టేలా ఉంది. వాళ్లు సీట్లు పంచుకునే లోపు.. మేము స్వీట్లు పంచుకుంటం. మైనంపల్లితో ఒక్కరు కూడా మా పార్టీ కార్యకర్తలు వెళ్లలేదు. పైగా కాంగ్రెస్ నుంచే మా పార్టీలోకి నాయకులు, కార్యకర్తలు వచ్చారు. అది చాలదా.. మైనంపల్లి వల్ల మాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదని చెప్పడానికి.