తెలంగాణ వీణ ,సినిమా : ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘గేమ్‌ఛేంజర్’ ఒకటి. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ అనగానే ఈ సినిమాపై ఎనౌన్స్‌మెంట్ నుంచీ అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోల హీరోయిజం పెక్యులర్‌గా ఉంటుంది. అది దొంగ కథ అయితే ఒకలా, ప్రేమికుడైతే ఒకలా, దేశభక్తుడు, సమాజహితం కోరుకునే చైతన్యమూర్తి కథ అయితే ఒక విధంగా… ఏదేమైనా రొటీన్‌గా మాత్రం ఆయన కథలు ఉండవు.త్వరలో రాబోతున్న శంకర్ ‘ఇండియన్ 2’చిత్రంలో కమల్‌హాసన్ హీరోయిజం ఎలా ఉంటుందో చెప్పేయొచ్చు. మరి ‘గేమ్‌ఛేంజర్’ మాటేంటి? అసలు ఈ సినిమాలో రామ్‌చరణ్‌ని ఆయన ఎలా చూపించబోతున్నాడు? అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్న. కథానుగుణంగా ఇందులో చరణ్ నాలుగు రకాలుగా కనిపిస్తారని సమాచారం.దేనికవే భిన్నమైన రూపాలన్న మాట. కథ అలా డిమాండ్ చేసింది మరి. శంకర్ సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ అనేది ఎప్పుడూ హైలైట్‌గానే ఉంటుంది. ‘గేమ్‌ఛేంజర్’లో కూడా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని టాక్. అంతేకాదు పలు అంశాలపై ప్రజలకు అవగాహన పెంచేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. శంకర్ ‘ఒకేఒక్కడు’ని మించే స్థాయి సినిమా అని కొందరంటున్నారు. ఈ చిత్రంలో కైరా అద్వాణీ కథానాయికగా నటిస్తున్నది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.