తెలంగాణ వీణ , హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో ఒక యువతి మృతి చెందిన ఘటన మెదక్ మండల పరిధిలోని శివ్వాయిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శివ్వాయిపల్లి చెందిన క్కొల్ల శేఖవ్వ, మల్లేశం రెండో కుమార్తె పావని(21) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో పేర్కొనడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కూతురి మృతి పై విచారణ చేపట్టాలని సోమవారం పావని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.