తెలంగాణ వీణ , సినిమా : శ్రీ విజయ మాధవి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమలో..’ . ఈ సినిమాకు ట్యాగ్‌లైన్ ‘పాపలు బాబులు’ . అభిదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీరాజ్ బల్లా తెరకెక్కిస్తున్నారు. విజయ మాధవి బల్లా నిర్మాత. సోమవారం ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగగా.. నటుడు, నిర్మాత మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై, ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోషన్ పోస్టర్ విడుదల అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ.. విజయ మాధవి బ్యానర్ అనే పేరు అద్భుతంగా ఉంది. శ్రీ రాజ్ మంచి దర్శక నిర్మాతగా నిలబడతారు. కష్టపడి, ఇష్టపడి చేస్తే ఫలితం కచ్చితంగా వస్తుంది. ప్రేమలో.. పాపలు, బాబులు అనే టైటిల్ కొత్తగా ఉంది. కాన్సెప్ట్ కూడా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. శ్రీరాజ్ సీరియల్స్ చేస్తూనే.. సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.