తెలంగాణ వీణ, సినిమా : మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తాజాగా వీరి వెడ్డింగ్ కార్డుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలను కార్డు పైభాగంలో ముద్రించారు. కార్డు లోపల వరుణ్ నానమ్మ, తాతయ్య పేర్లను పెట్టారు. వారి పేర్ల కింద చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లను ముద్రించారు. వీరి పెళ్లి నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో జరగనుంది. అక్టోబర్ 30న పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 27న మెగా ఫ్యామిలీ ఇటలీకి బయల్దేరనుందట. నవంబర్ 5న రిసెప్షన్ ను హైదరాబాద్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో రిసెప్షన్ జరగనుంది.