తెలంగాణ వీణ , క్రీడలు : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో ఎన్నికల నగారా మోగింది ఈ నెల 20వ తేదిన ఎన్నికలు జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుర్తింపు ఉన్న క్లబ్‌లు తమ ప్రతినిధులను మార్చుకునేందుకు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 14వ తేదీన స్క్రూటినీ జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 16 ఆఖరి తేది కాగా అదే రోజు తుది జాబితాను ప్రకటించనున్నారు. దీనికి తోడు హెచ్‌సీఏకు అనుబంధంగా ఉన్న 149 క్లబ్‌లతో పాటు జిల్లాల అసోసియేషన్లు, మాజీ క్రికెటర్ల (పురుషులు, మహిళలు) జాబితాను వీఎస్ సంపత్ మీడియాకు విడుదల చేశారు. ఇదిలా ఉంటే హెచ్‌సీఏకు సెప్టెంబర్ 2019లో చివరిసారి ఎన్నికలు జరుగగా, మాజీ కెప్టెన్ అజారుదీన్ నేతృత్వంలో ప్యానెల్ కొలువుదీరింది. అయితే అజర్ అధ్యక్ష పదవీకాలం సెప్టెంబర్ 2020లోనే ముగిసింది. హెచ్‌సీఏలో నెలకొన్న అవినీతి ఆరోపణలు, బహుళ క్లబ్‌ల ప్రాతినిధ్యంపై సుప్రీం కోర్టు జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.