తెలంగాణ వీణ , సినిమా : సంక్రాంతి పండగను ఆర్నెళ్ల ముందే లాక్ చేసుకున్న సినిమా గుంటూరు కారం. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఈ సారి చెప్పిన డేట్ కన్ఫార్మ్ అని పదే పదే మేకర్స్ చెబుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి నిర్మాత నాగవంశీ కూడా సంక్రాంతికే ఫిక్స్ అని బల్లగుద్ది చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. నాలుగు పాటలకు సంబంధించిన మేకింగ్‌తో పాటు ఓ చిన్న టాకీ పార్టు ఉందట. త్రివిక్రమ్ ఈ సారి బాబును మాములుగా చూపించట్లేదని ఇన్‌సైడ్ టాక్. అతడు, ఖలేజా సినిమాలో క్యారెక్టర్‌లకు మాస్ తోడైతే ఏ రేంజ్‌లో ఉంటుందో మహేష్ రోల్ ఆ రేంజ్‌లో ఉంటుందట. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ పూర్తయినట్లు నాగవంశీ వెల్లడించాడు. నైజాం రైట్స్‌ను దిల్‌రాజు దక్కించుకున్నాడట. సరైన నెంబర్ చెప్పలేదు కానీ.. ఇండస్ట్రీ టాక్ ప్రకారం రూ.45 కోట్లని సమాచారం. ఇక దిల్‌రాజు సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ చూశాడట. అవి చూసిన తర్వాత సంక్రాంతికి సరైన బొమ్మ ఇదేనని ఈ రేటు పెట్టాడట. ఇక మాములుగా దిల్‌రాజు అంటేనే సక్సెస్‌కు ఎగ్జాంపుల్. ఒకటి రెండు సినిమాలను జడ్జ్ చేయడంలో లెక్క తప్పాడు కానీ.. ఆయన జడ్జిమెంట్‌కు తిరుగుండదు. అలాంటి మనిషి గుంటూరు కారం సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే మహేష్ అభిమానులు సినిమా వేరే లెవల్లో ఉండబోతుందని ఫిక్సయిపోయారు.
Previous article
Next article
RELATED ARTICLES
దూరభిమానం ప్రజలకు ప్రాణ సంకటం
తెలంగాణ వీణ, మేడ్చల్ జిల్లా : అభిమానం ఎంతైనా ఉండొచ్చుగాని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అవసరమా సారు. నడి రోడ్డు పైనే ఫ్లెక్సీ లు,...
యూకే పార్లమెంటులో చిరంజీవికి అపురూప సన్మానం
తెలంగాణ వీణ, సినిమా : యూకే పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం లభించింది. ఎంతోమంది పార్లమెంటు సభ్యులు, మంత్రులు,...
బెట్టింగ్ యాప్ కేసుపై విజయ్ దేవరకొండ టీమ్ వివరణ
తెలంగాణ వీణ, సినిమా : యూట్యూబర్లకే కాదు, సినీ తారలకు కూడా బెట్టింగ్ యాప్ ల వ్యవహారం మెడకు చుట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్...