తెలంగాణ వీణ : కాప్రా సర్కిల్ పరిధిలోని కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలకు ఉత్సవ కమిటీ కన్వీనర్ ఏ వి ఆర్ దత్తు, ముఖ్య సలహాదారు బొజ్జ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి చీరాల వేలం పాట కార్యక్రమానికి కాలని వాసులు పెద్ద ఎత్తున హాజరై వేలం పాటలో పాల్గొన్నారు.అనంతరం శోభాయాత్రను ప్రారంబించారు.శుభాషిని కోలాటం బృందంచే ఏర్పాటు చేసిన కోలాట నుత్య ప్రదర్శన, కాలని వాసులను,భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ బాలరాజు, కోశాదికారి బూడిద జనార్ధన్,ఉత్సవ కమిటీ ప్రతినిధులు వెంకట్ రెడ్డి,పెంటయ్య గౌడ్,దశరథ, ఎం ఎన్ చారి, దశరథ్ గౌడ్,రామాచారి,మాధవ రావు,సుధాకర్ రావు,రామచందర్ రావు, ఎం ఎస్ చారి,సుభాషిణి, వాణి, మల్కరమాదేవి,కరుణ,సుజాత,శోభా, కాలని వాసులు కమిటి సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.