తెలంగాణవీణ, కాప్రా : తెలంగాణ రాష్ట్ర నాయకులు రేగళ్ల సతీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మంగళవారం కాప్రా డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఉప్పల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు స్వర్ణరాజ్ శివమణి, బొంతు శ్రీదేవి యాదవ్, పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గొల్లూరి అంజయ్య, పావని రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు ఉద్యమ నాయకులు వారితోపాటు బిజెపి, కాంగ్రెస్, టిడిపి, నాయకులు కార్యకర్తలు పాల్గొని రేగిళ్ల సతీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు