తెలంగాణ వీణ , జాతీయం :ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భయానక వీడియో బయటపడింది. పాఠశాల నుంచి తిరిగి వస్తున్న ఓ బాలిక తన భవనంలోని లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. కరెంటు పోవడంతో లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయింది.దీంతో బాలిక భయాందోళనకు గురైంది. నిరంతరాయంగా కరెంటు ఆన్ఆఫ్ చేయడంతో, బాలిక సుమారు 20 నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది. ఈ సమయంలో బాలిక తీవ్ర భయాందోళనకు గురై లిఫ్ట్‌లో కేకలు వేసింది. లిఫ్ట్‌లో అమర్చిన కెమెరాలో బాలిక ఏడుస్తూ కేకలు వేయడం రికార్డు అయ్యింది. తనను బయటకు తీయమని వేడుకుంది. కానీ ఆ బాలిక అరుపులు ఎవరికీ వినిపించలేదు. చాలా సేపటి తర్వాత బేస్‌మెంట్‌లో లిఫ్ట్ తెరుచుకోవడంతో బాలిక బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
పూర్తి వివరాల్లోకి వెళ్లితే..లక్నోలోని కుర్సీలో జనేశ్వర్ ఎన్ క్లేవ్ ఉంది. ఈ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ నెంబర్ 1105లో నివాసం ఉంటున్న ధ్వని అనే చిన్నారి బుధవారం మధ్యాహ్నం లిఫ్ట్ ఎక్కింది. అయితే ఆ చిన్నారి ఎక్కిన వెంటనే పవర్ పోయింది. దీంతో లిఫ్ట్ ఆగిపోయింది. లిఫ్టులో ఆ చిన్నారి ఒంటిరిగా ఉండటంతో భయపడింది. అయినా సరే ధైర్యం తెచ్చుకుని లిఫ్టు తలుపులు తెరిచేందుకు ఎంతో ప్రయత్నం చేసింది. గట్టిగా అరిచింది. ఏడిచింది. లిఫ్ట్ లో సీసీ కెమెరా ఉందని ఆ చిన్నారికి తెలుసు. ఆ కమెరా వైపు చూస్తూ ఆ చిన్నారి వేడుకుంది. చేతులు జోడించి ఓదేవుడా నన్ను ఎలాగైనా రక్షించు అంటూ దేవుడిని ప్రార్థించడం ఆ వీడియోలో కనిపించింది. ఇలా చిన్నారి దాదాపు 20 నిమిషాల పాటు అందులో ఉండి ..సురక్షితంగా బయటకు వచ్చింది.
విద్యుత్ అంతరాయం కారణంగా ఆ చిన్నారి లిఫ్ట్ లో ఇరుక్కుపోయిందని..వెంటనే చిన్నారిని రక్షించేందుకు చర్యలు తీసుకున్నామని నిర్వాహకులు చెప్పారు. భద్రతా కారణాల వల్ల 12ఏళ్ల లోపు చిన్నారులను లిఫ్ట్ లో ఒంటరిగా ప్రయాణించేందుకు పర్మిషన్ ఇవ్వకూడదని నివాసితులను అభ్యర్థించారు.