టీడీపీ కార్యాలయం వద్ద సత్యమేవ జయతే దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ… గాంధీ జయంతిని ఇంటర్నేషనల్ నాన్ వయోలెన్స్ డేగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసుని నిరసిస్తూ శాంతియుతంగా దీక్ష చేపట్టామన్నారు. ఏపీలో అరాచకపాలన సాగిస్తున్న సైకో నుంచి త్వరలోనే విముక్తి లభిస్తుందని నారాయణ చెప్పుకొచ్చారు.బద రవిచంద్ర మాట్లాడుతూ.. నారా భువనేశ్వరి తన తండ్రి, భర్త సీఎంలుగా పనిచేసినా ఏ రోజూ రాజకీయలు, పాలన గురించి పట్టించుకోలేదన్నారు. నిండు సభలో భువనేశ్వరిని దుర్మార్గంగా, నీచంగా అవమానించారన్నారు. ఇవాళ ప్రజల కోసం ఓ తల్లిలా, అక్కలా, చెల్లెలిలా పోరాడుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌ను ఎందుకు ఓడించాలి? చంద్రబాబుని ఎందుకు గెలిపించాలి? అని ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు.