తెలంగాణ వీణ, సినిమా : డ్రగ్స్ కేసులో సినీ హీరో నవదీప్ ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఈడీ అధికారులు.. నవదీప్‌ను విచారిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలతో పాటు… పలు కీలక పత్రాలను ఈడీ ఎదుట సమర్పించారు. డ్రగ్స్ కేసులో ఆర్థిక కోణాల్లో విచారిస్తున్నారు. నైజీరియన్స్‌తో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది.