తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద రైతుల చెప్పులు బారులు తీరేవి. పంపిణీ కేంద్రాల వద్ద రైతులు ఘర్షణకు దిగడం, ఆందోళనలు ఆనాడు సర్వసాధారణం. ఊరూరా ఈ సమస్య ఉండేది.
రైతుల బాధల్ని పట్టించుకున్ననాథుడు లేడు. ప్రతిఏటా ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద రైతులపై లాఠీచార్జీలు జరిగేవి. ఎరువులు కోసం రైతులు ధర్నాలు, నిరసనలు చేయాల్సి వచ్చేది.