తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో సీఎం కేసీఆర్ అబద్ధాల కోరు అయితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే నేత అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ సభలో బీజేపీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ..‘‘ఎన్నికలు రాగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం అంటున్నారు. పదేళ్లుగా ఇవ్వని వారు ఇప్పుడు దొంగ ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదల సొంతింటి కల నెరవేరుస్తాం. ప్రతీ ఇంట్లో ఇద్దరు వృద్ధులకు పెన్షన్లు ఇస్తాం. వేలాదిమంది గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ పాలసీ అమలు చేస్తాం. మోదీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో పథకాలు పెట్టి అబద్ధాలు చెబుతున్నారు. కేసీఆర్ 1.65లక్షల అప్పు తెలంగాణకు మిగిలించాడు తప్ప రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు. డబ్బులొస్తాయి.. తీసుకోండి.. ఓటు మాత్రం మాకే వేయండి’’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.