తెలంగాణ వీణ , దుబ్బాక : దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై సిద్దిపేట జిల్లాలో బీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు ఆందోళనలు చేపట్టా రు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి పై, అందుకు బాధ్యులైన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దుబ్బా క, దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, తొగు ట, చేగుంట, నార్సింగ్, అక్బర్‌పేట-భూంపల్లి మండలాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ సం ఖ్యలో ర్యాలీలు నిర్వహించారు. దుబ్బాకలో రఘునందన్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు.
హత్యాయత్నం ఘటనకు నిరసనగా బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం దుబ్బాక నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని మండలకేంద్రాల్లో, ప్రతి గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు నల్లజెండాలతో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. కాగా, కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించేందుకు మెదక్ పార్లమెంట్ పరిధి సహా దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నుంచి పెద్దఎత్తున బీఆర్‌ఎస్ నేతలు దవాఖానకు తరలివచ్చారు. బీజేపీకి, దుబ్బా క ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు వ్యతిరేకంగా దవాఖాన ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.