తెలంగాణ వీణ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అతి ముఖ్యమైన ఘట్టమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం కాప్రా మండల పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మరియు కీసర మండల పరిధిలోని రాంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.కాప్రా మండల పరిధిలో గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్ అసెంబ్లీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మరియు కీసర మండల పరిధిలో గల రాంపల్లిలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.