తెలంగాణ వీణ , హైదరాబాద్ : కార్యకర్తలకు అందుబాటులో ఉండని మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్‌కు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ కోదాడ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన దాదాపు 300 మంది కార్యకర్తలు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీటీసీ వెంకన్న నారాయణ, ప్రభాకర్, గోపి, వెంకటేశ్వర్లు, జయంత్, అశోక్, బాబా నేతృత్వంలో ఆందోళన సాగింది.
కోదాడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మావతిఉత్తమ్ తోపాటు మరో నలుగురు అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఓటమి పాలైనప్పటి నుంచి కార్యకర్తల బాగోగులు పట్టించుకోలేదని, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నియోజకవర్గంలో తిరగడం సరికాదని పేర్కొన్నారు.